Adikavi Nannaya University PRO

Adikavi Nannaya University PRO ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ సమాచారం, సదస్సులు, సాంస్కృతిక మరియు విద్యా సంబంధిత కార్యక్రమాలు

22/04/2024

Aknu

17/02/2024

16/02/2024
05/02/2024

జాతీయస్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సవములు

05/02/2024

జాతీయస్థాయి ఆదివాసీల సాంస్కృతిక మహోత్సవములు

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ 13, 14, 15వ స్నాతకోత్సవ పేపర్ క్లిప్పింగ్స్
01/02/2024

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ 13, 14, 15వ స్నాతకోత్సవ పేపర్ క్లిప్పింగ్స్

https://www.youtube.com/live/nL--r7y9zD0?si=e1SDPebuY2g6beOy*సౌత్ అండ్ వెస్ట్ జోన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ LIVE (D...
10/12/2023

https://www.youtube.com/live/nL--r7y9zD0?si=e1SDPebuY2g6beOy

*సౌత్ అండ్ వెస్ట్ జోన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ LIVE (DAY 2) వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.* ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి📲.

పి.ఆనంద్, పి.ఆర్.వో✒️

10/12/2023

SOUTH WEST ZONE INTER UNIVERSITY
WEIGHTLIFTING CHAMPIONSHIPS 2023-24
Day 2

SOUTH & WEST ZONE INTER UNIVERSITYWEIGHTLIFTING CHAMPIONSHIPS 2023-24(Men & Women)
09/12/2023

SOUTH & WEST ZONE INTER UNIVERSITY

WEIGHTLIFTING CHAMPIONSHIPS 2023-24

(Men & Women)

06/12/2023

WEIGHTLIFTING CHAMPIONSHIPS 2023-24 (Men & Women)

9th-12th December, 2023

Venue
Indoor Stadium, Adikavi Nannaya University Campus, Rajamahendravaram, A.P, India.

జి.ఎస్.ఎల్ తో నన్నయ ఎంవోయూ జి.ఎస్.ఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మధ్య అవగాహాన ఒప్పందం కుదిరింద...
23/11/2023

జి.ఎస్.ఎల్ తో నన్నయ ఎంవోయూ



జి.ఎస్.ఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మధ్య అవగాహాన ఒప్పందం కుదిరింది. గురువారం యూనివర్సిటీలో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో వీసీ ఆచార్య కె.పద్మరాజు సమక్షంలో జి.ఎస్.ఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గన్ని భాస్కరరావు, రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మరియు జి.ఎస్.ఎల్ వివిధ అంశాలపై పరస్పర ప్రయోజనలతో అవగాహాన ఒప్పందాన్ని కుదుర్చుకుందని అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ సహకారంతో జి.ఎస్.ఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ లో ఆసక్తిగల విద్యార్థులకు, సిబ్బందికి యోగా డిప్లమా, యోగా పీజీ డిప్లమా కోర్సులను అందిస్తున్నామన్నారు. అలాగే జి.ఎస్.ఎల్ సహకారంతో విశ్వవిద్యాలయ విద్యార్థులకు, సిబ్బందికి ఫార్మసీ మినహా వర్తించే అన్ని ఛార్జీలపై 25 శాతం తగ్గింపు ఇస్తారని, ఉచిత అంబులెన్స్ సర్వీసుల ను అందిస్తారని చెప్పారు. ఎం.పి.ఈడి కోసం ఫిజియోథెపీ ల్యాబ్ శిక్షణ ఇస్తారని తెలియజేసారు. జి.ఎస్.ఎల్ చైర్మన్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ తన తల్లి గన్ని సుబ్బలక్ష్మీ పేరుతో ప్రారంభించిన జి.ఎస్.ఎల్ మెడికల్ కాలేజ్ 20 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపబడుతుందన్నారు. యోగా డిప్లమా, యోగా పీజీ డిప్లమా కోర్సులు విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. నన్నయ విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థులకు జి.ఎస్.ఎల్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వాటని సద్వినియోగం చేసుకోవచ్చునని తెలియజేసారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ మాట్లాడుతూ ఈ ఎంవోయూ ద్వారా రెండు సంస్థల్లోని విద్యార్థులకు, సిబ్బందికి విద్య వైద్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, జి.ఎస్.ఎల్ కలిసి మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అనంతరం విశ్వవిద్యాలయం తరుపున గన్ని భాస్కరరావును సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ప్రిన్సిపాల్ ఆచార్య డి.జ్యోతిర్మయి, జి.ఎస్.ఎల్ డైరెక్టర్ వి.హర్ష, ప్రిన్సిపాల్ డా.పి.అప్పరావు, వైస్ ప్రిన్సిపాల్ డా.పి.చతుర్వేది, యోగా టీచర్ పి.ఆశ, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.



రైటప్: ఎంవోయూ పత్రాలను మార్చుకుంటున్న జి.ఎస్.ఎల్, నన్నయ అధికారులు

ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, తాడేపల్లిగూడెం క్యాంపస్ ఈరోజు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఆమోదం పొ...
22/11/2023

ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, తాడేపల్లిగూడెం క్యాంపస్ ఈరోజు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఆమోదం పొందింది. APEAPCETలో అర్హత పొందిన విద్యార్థులు ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ పోర్టల్‌లో AKNU (AKNTSF)ని ఎంచుకోని బీఫార్మసీ లో ప్రవేశం పొందవచ్చు.

సెపక్ తక్రా గేమ్ లో నన్నయ విద్యార్థికి కాంస్య పతకంఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సి.ఎస్.ఈ సెకండియర్ విద్...
08/11/2023

సెపక్ తక్రా గేమ్ లో నన్నయ విద్యార్థికి కాంస్య పతకం

ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సి.ఎస్.ఈ సెకండియర్ విద్యార్థి తంగెళ్ళ షణ్ముఖ శ్రీవంశీ నేషనల్ గేమ్స్ సెపక్ తక్రా లో కాంస్య పతకాన్ని సాధించారని వీసీ ఆచార్య కె.పద్మరాజు అభినందించారు. మంగళవారం యూనివర్సిటీ వీసీ కార్యలయంలో వీసీ పద్మరాజు షణ్ముఖ శ్రీవంశీ కి కాంస్య పతకాన్ని ధరింప చేసి అభినందించి వివరాలను తెలియజేసారు. గోవాలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 3వ తేదీ వరకు జరిగిన 37వ నేషనల్ గేమ్స్ లో సెపక్ తక్రా గేమ్ రెగ్ ఈవెంట్ లో నన్నయ యూనివర్సిటీ విద్యార్థి తంగెళ్ళ షణ్ముఖ శ్రీ వంశీ కి కాంస్య పతకం రావడం ఆనందంగా ఉందన్నారు.నేషనల్ గేమ్స్ సెపక్ తక్రా లో 11 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ కు మెడల్ వచ్చిందని, దీనిలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్థికి మెడల్ రావడం హర్షనీయమన్నారు. వంశి ఇప్పటివరకు 8 నేషనల్ గేమ్స్ ఆడాడని, చాలా కష్టమైన సెపక్ తక్రా గేమ్ లో స్ట్రైకర్ గా వంశీ విశేష ప్రతిభ కనపరిచి మెడల్ సాధించాడని కొనియాడారు.
గ్రామీణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శ్రీవంశీ ని క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, ఆంధ్రప్రదేశ్ సెపక్ తక్రా అసోసియేషన్ వారిని వీసీ అభినందించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రాగణంలో సెపక్ తక్రా గేమ్ కోర్టును ఏర్పాటు చేసి అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు. గోదావరి జిల్లాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వేదిక గా నిలుస్తుందని తెలియజేసారు. సెపక్ తక్రాలో మరింత ప్రతిభ కనబరచి భవిష్యత్ లో బంగారు పతాకాన్ని సాధించాలని వీసీ ఆకాంకించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ మాట్లాడుతూ ఎంతో కృషి చేసి నేషనల్ గేమ్స్ లో మెడల్ సాధించిన శ్రీవంశిని అభినందించి, సెపక్ తక్రా కు సంబంధించి విశ్వవిద్యాలయ స్థాయిలో చక్కని టీమ్ ను సిద్ధం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జిసుధాకర్, ప్రిన్సిపాల్ డా.పి.వెంకటేశ్వరరావు, విభాగాధిపతి డా.బి.కెజియారాణి, డా.డి.జ్యోతిర్మయి, పీడీ దేవానంద్, తండ్రి చంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

రైటప్ : సెపక్ తక్రాలో మెడల్ సాధించిన శ్రీవంశి ని అభినందిస్తున్న వీసీ పద్మరాజు

ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ కు నన్నయ విద్యార్థులు ఎంపిక వెస్ట్ జోన్ ఎన్.ఎస్.ఎస్. ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ కు ...
30/10/2023

ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ కు నన్నయ విద్యార్థులు ఎంపిక



వెస్ట్ జోన్ ఎన్.ఎస్.ఎస్. ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ కు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుండి ఐదుగురు విద్యార్థినిలు ఎంపికయ్యారని వీసీ ఆచార్య కె.పద్మరాజు తెలిపారు. సోమవారం యూనివర్సిటీలోని వీసీ పద్మరాజు ప్రీ రిపబ్లిక్ డే పెరిడ్ క్యాంప్ కు ఎంపికైన విద్యార్థులను అభినందించి వివరాలను తెలియజేసారు. ఇటీవల విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగిన ప్రీ రిపబ్లిక్ డే పెరిడ్ ఉమెన్ క్యాంప్ లో ప్రతిభ కనపరచిన ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసారని, వీరిని కె.ఎల్.యూనివర్సిటీ విజయవాడలో వెస్ట్ జోన్ ఎన్.ఎస్.ఎస్. ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ కు పంపిస్తున్నామని తెలిపారు. వెస్ట్ జోన్ ఎన్.ఎస్.ఎస్. ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ కు డి.నిస్సి ప్రియాంక ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ, టి.అపరంజిత ఐడిఎల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాకినాడ, కె.తరుణి ఆదిత్య డిగ్రీ కాలేజ్ తుని, ఇ. గీతికా దేవి ఎస్.కె.ఎస్.డి. మహిళ కళాశాల తణుకు, ఆర్. నాగేశ్వరి ఆదిత్య డిగ్రీ కాలేజ్ రాజమండ్రి విద్యార్థులు ఎంపికయ్యారని తెలియజేసారు. పది రోజుల పాటు జరిగే ఈ క్యాంప్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జనవరి 1 నుంచి 31 తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపు లో పాల్గొంటారని చెప్పారు. రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ లో విద్యార్థులు చక్కని ప్రతిభ కనపరచి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఖ్యాతిని ప్రసరింపజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ ఆచార్య వై.శ్రీనివాసరావు మరియు ఆయా కళాశాలల ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఎన్.ఎస్.ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

రైటప్: ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ కు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న వీసీ

ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ తో నన్నయ వర్సిటీ ఎంవోయు ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ తో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అవగాహాన ఒప్ప...
16/10/2023

ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ తో నన్నయ వర్సిటీ ఎంవోయు



ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ తో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అవగాహాన ఒప్పందాన్ని (ఎంవోయు) కుదుర్చుకుంది. సోమవారం యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ తో ఎంవోయు మరియు వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రరెడ్డి, నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.పద్మరాజు, ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్ యూనిట్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల అరోహి, రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, సభాధ్యక్షులు ఐ.క్యూ.ఎ.సి. డైరెక్టర్ డా.వి.పెర్సిస్ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాప్షీ చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఉన్నత విద్య అభివృద్ధిపై ప్రత్యేక విజన్ ను కలిగి ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్ షిప్ ద్వారా కొత్త మార్గదర్శకాలను అందిస్తున్నారని తెలిపారు. టెక్నాలజీ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోవిడ్ సంక్షోభం తరువాత ఆన్లైన్ లెర్నింగ్ ఎక్కువగా అందుతుందన్నారు. జాతీయ విద్యావిధానానం 2020 అమలులో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. దీనిలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కీలక పాత్రను పోషిస్తుందని చెప్పారు. నూతన విద్యా విధానాలతో ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు, అధ్యాపకులు అప్ డేట్ అవుతూ ప్రయోజనకరమైన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ తో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అవగాహాన ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ ద్వారా అందించే సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొనిన సాంకేతిక రంగంలో నన్నయ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

వీసీ ఆచార్య కె.పద్మరాజు మాట్లాడుతూ ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ తో అవగాహాన ఒప్పందం కుదుర్చుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీని వలన అధ్యాపకులకు విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ఈ ఎంవోయు కుదుర్చుకున్నామన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తుందని అన్నారు. సిఎం వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఉన్నత విద్యకు ఎంతో ప్రాధన్యతనిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోని ఐటీ రంగంలో ప్రతీ నాలుగురిలో ఒక తెలుగువాడు ఉంటాడని తెలిపారు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ ఎంవోయు తో విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలలకు కూడా ప్రయోజనాలు కలుగుతాయని తెలియజేసారు.

ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల అరోహి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ లో 20 వేల కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఎంవోయు ద్వారా అధ్యాపకులు, విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులలో రిజిస్టేషన్ చేయించుకొని, శిక్షణ పొందవచ్చునన్నారు. శిక్షణ పూర్తి అయిన తదుపరి సర్టిఫికెట్స్ అందిస్తామని వాటిద్వారా ఓపెన్ మార్కెట్ లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ కోర్సులు చేయడం ద్వారా మిగిలి వారి కంటే టెక్నాలజీలో ఉన్నతంగా ఉంటారని తెలియజేసారు. విద్యాలయాలకు, సాఫ్ట్ వేర్ సంస్థలకు మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఈ ఎంవోయు వారధిలా ఉపయోగపడుతుందన్నారు. లైఫ్ లాంగ్ లెర్నర్ లుగా ఉండాలని, నిత్య విద్యార్థిగా ఉన్న వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయన్నారు. ఇటీవల కాలంలో ట్రెండింగ్ లో ఉన్న చాట్ జిపిటి, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఆటోమేషన్, ఎనలిటీక్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా టెక్నాలజీస్,సి లాగ్వెజ్, సైబర్ సెక్యూరిటీ, కోడింగ్, డేటా సైన్స్, ఎడ్జ్ కంప్లీటింగ్ వంటి టెక్నాలజీస్ పై పట్టు సాధించాలన్నారు. ఈ పోటీ ప్రపంచంలో అనవసరమైన ఫన్స్ కోసం సమయాన్ని వృదా చేయడకండి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని తెలియజేసారు. సీనియర్ బిజినెస్ మేనేజర్ లెర్నింగ్ – ఇన్ఫోసిస్ డా.ఎస్.మీనాక్షి, ఇన్ఫోసిస్ లెర్నింగ్ స్పెషలిస్ట్ సహన కుమారస్వామి రిసోర్స్ పర్సన్స్ గా హాజరై నూతన టెక్నాలజీస్ కు సంబంధించిన అంశాలను ప్రెజెంటేషన్ ద్వారా అందించారు. తరువాత యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల అరోహి లు ఎంవోయు పత్రాలపై సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. అనంతరం అతిథులను సన్మానించి జ్ఞాపికలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ప్రత్యేకాతిథులుగా ఆచార్య జె.వి.ఆర్.మూర్తి (జె.ఎన్.టి.యు.కె), డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ ఆచార్య పి.సురేష్ వర్మ, ఐ.క్యూ.ఎ.సి. డైరెక్టర్ డా.వి.పెర్సిస్, ప్రిన్సిపాల్ డా.పి.వెంకటేశ్వరరావు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా.బి.కెజియారాణి, డా.లతా, విశ్వవిద్యాలయ అధికారులు, అనుబంధ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.



రైటప్: ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్‌ తో ఎంవోయు కుదుర్చుకుంటున్న దృశ్యం

14/09/2023

'23

14/09/2023

'23

12/09/2023

'23

10/09/2023

'23

08/09/2023

5days to go☺️..
'23

Address

Rajahmundry
Rajahmundry

Telephone

+919701293231

Website

Alerts

Be the first to know and let us send you an email when Adikavi Nannaya University PRO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Adikavi Nannaya University PRO:

Videos

Share