Shiva Teja Event Organisers

  • Home
  • Shiva Teja Event Organisers

Shiva Teja Event Organisers hi

16/12/2023
12/04/2023
మరిపెడ .భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ సంఘం కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమా...
27/09/2022

మరిపెడ .భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ సంఘం కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా వైఎస్ ప్రెసిడెంట్ వీరబాబు మాట్లాడుతూ భగత్ సింగ్ కలలు కన్న నిజమైన స్వాతంత్రం పొందాలంటే నేటి యువత మతోన్మాదానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని అన్నారు ప్రగతిశీల అభ్యుదయ భావాలకు వ్యతిరేకమైనటువంటి పరిపాల నిర్వహిస్తున్న పాఠ్యాంశాల్లో మతోన్మాదాన్ని మూఢత్వాన్ని పెంచే విధంగా విద్యా విధానాన్ని అవలంబిస్తుందని అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా ఉరికంభం ముద్దాడిన భగత్ సింగ్ జీవిత విశేషాలను కర్ణాటక ప్రభుత్వం పాఠ్యంశం నుంచి తొలగించి మూఢవిశ్వాసాలు పెంచే విధంగా స్వాతంత్ర పోరాటంలో ఏ రోజు పాలుపంచుకొని సావర్కర్ అండమాన్ జైలు నుంచి బుల్బుల్ పక్షి రెక్కల పై వచ్చి పోరాటం చేసి మళ్లీ జైలుకు వెళ్ళినట్టుగా పాఠ్యపుస్తకాలలో ఉంచారు ఇది నీతిమాలిన విద్యా విధానానికి మూఢత్వానికి నిదర్శనమని అవలంబిస్తున్న విద్యా విధానాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంకై యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీనివాస్ సందీప్ ప్రసాద్ కుమార్ రవి శ్రీకాంత్ ప్రణయ్ పృథ్వి శేఖర్ ఉమేష్ ప్రవీణ్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు

మరిపెడ .భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ సంఘం కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటాని...

విభజన హామీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం
27/09/2022

విభజన హామీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం

విభజన హామీలు విస్మరించిన కేంద్ర ప్రభుత్వం -తెలంగాణపై అక్కసు వేల్లగక్కుతున్న బిజెపి ప్రభుత్వం-జిల్లా గ్రంథాలయ...

మహబూబాబాద్, గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులైన లా పట్టాభద్రులు 3 సంవత్సరముల న్యాయవాద వృత్తి నైపుణ్య శిక్షణ  కొరకు మహబూబాబా...
23/02/2021

మహబూబాబాద్, గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులైన లా పట్టాభద్రులు 3 సంవత్సరముల న్యాయవాద వృత్తి నైపుణ్య శిక్షణ కొరకు మహబూబాబాద్ జిల్లా నుండి ఒక్కరు లా పట్టభద్రునకు నెలకు వెయ్యి రూపాయలు స్టైఫెండ్ రూపంలో ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. పుస్తకములు, ఫర్నీచర్ కొనుగోలు కొరకు ఆరు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు గ్రామీణ ప్రాంతములొని వారు ఒక లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల ఆదాయ పరిమితి మించరాదని, ఆసక్తి గల నిరుద్యొగ యువతీ, యువకులైన లా పట్టభద్రులు పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు రెండు పాస్ పోర్ట్ సైజు పోటోలు, విద్యార్హత, కుల ధృవీకరణ, ఆదాయము, నివాస ధృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించి ఈ నెల 25 సాయంత్రం 5 గంటల లోగా జిల్లా గిరిజన అధికారి కార్యాలయం, ఇందిరానగర్, మహబూబాబాద్ కార్యాలయంలో సమర్పించాలని ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు.

https://shivatejanews.wordpress.com/2021/02/23/%e0%b0%b2%e0%b0%be-%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%88%e0%b0%ab%e0%b1%86%e0%b0%82/

లా పట్టభద్రులకు స్టైఫెండ్

మహబూబాబాద్, జిల్లాలోని ఎస్సీ బాల, బాలికలకు 2021-22 విద్యా సంవత్సరానికి గాను బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఒకటవ త...
23/02/2021

మహబూబాబాద్, జిల్లాలోని ఎస్సీ బాల, బాలికలకు 2021-22 విద్యా సంవత్సరానికి గాను బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఒకటవ తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో కోరారు. ఎస్సీ విద్యార్ధినీ, విద్యార్ధులు 2015 జూన్ 1 నుండి 2016 మే 31 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతములో ఒక లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతంలో 2 లక్షలకు మించరాదని, నివాస, ఆదాయ ధృవపత్రములు మీ సేవ ద్వారా పొంది జిరాక్స్ కాపీలను ఏదేని గెజిటెడ్ అధికారిచే ధృవీకరించి ధరఖాస్తుకు జతపర్చాలన్నారు. ...

https://shivatejanews.wordpress.com/2021/02/23/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d/

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశానికి ధరఖాస్తు

సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ వారియర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప...
22/02/2021

సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ వారియర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో సైబర్ క్రైమ్ యూనిట్ ఏర్పాటు ద్వారా స్ధానికంగానే కేసులను పర్యవేక్షించేందుకు సాంకేతిక పరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని డీజీపీ గారి చేతుల మీదుగా ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా హైదరాబాదు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న డీజీపీ గారు జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు.పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రలోని ప్రతీ జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ ఏర్పాటు… తద్వారా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ కార్యాచరణ రూపొందించి శిక్షణ ఇస్తునట్లు తెలిపారు....

https://shivatejanews.wordpress.com/2021/02/22/%e0%b0%b8%e0%b1%88%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%af%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%97/

సైబర్ వారియర్స్ యంత్రాంగం ఏర్పాటు

మహబూబాబాద్, గ్రీవెన్స్ లో వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆద...
22/02/2021

మహబూబాబాద్, గ్రీవెన్స్ లో వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సర్వే నెంబర్లుగా మార్చడం జరుగుతుందని, విచారణ జరిపి తప్పుడు రిపొర్ట్ ఇచ్చిన సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ నివాసి గాండ్ల కిరణ్ దరఖాస్తు ఇచ్చారు. వెంటనే ఈ విషయమై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆర్డిఓ, సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులను ఆదేశించారు....

https://shivatejanews.wordpress.com/2021/02/22/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%a7%e0%b0%b0%e0%b0%96%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b5%e0%b1%86%e0%b0%82%e0%b0%9f%e0%b0%a8%e0%b1%87/

ప్రజల ధరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా అన్ని పోస్టల్‌ ‌సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ ‌సేవక్‌ ‌పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఇండియా పోస్ట్ ‌...
22/02/2021

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా అన్ని పోస్టల్‌ ‌సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ ‌సేవక్‌ ‌పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఇండియా పోస్ట్ ‌నోటిఫికేషన్లను విడుదల చేసింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 1150 పోస్టుల్ని, ఆంధప్రదేశ్‌లో 2296 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇక ఆంధప్రదేశ్‌లో గ్రామీణ డాక్‌ ‌సేవక్‌ ‌పోస్టుల భర్తీకి దరఖాస్తు పక్రియ కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరి 26లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https/appost.in/వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ‌దరఖాస్తుల్ని మాత్రమే స్వీకరిస్తోంది ఇండియా పోస్ట్....

https://shivatejanews.wordpress.com/2021/02/22/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2-%e0%b0%ad%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%8b%e0%b0%9f%e0%b0%bf%e0%b0%ab%e0%b0%bf%e0%b0%95%e0%b1%87/

పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ‌విడుదల

వేసవిలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు 'డ్రై సీజన్‌ అలవెన్స్‌'చెల్లించేందుకు...
21/02/2021

వేసవిలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు 'డ్రై సీజన్‌ అలవెన్స్‌'చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జూన్‌ 30 వరకు ఉపాధి కూలీలు ఈ అలవెన్స్‌ను పొందనున్నారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి 25 శాతం, ఏప్రిల్‌/మేలలో 30 శాతం, జూన్‌లో 20 శాతం మేర ఈ అలవెన్స్‌ చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎండా కాలంలో వేడి పెరగడం వల్ల చేసే పని తగ్గి ఆ మేరకు వారికొచ్చే కూలీ తగ్గే అవకాశాలున్నందున ఈ అలవెన్స్‌ను వర్తింపజేస్తారు....

https://shivatejanews.wordpress.com/2021/02/21/%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88-%e0%b0%b8%e0%b1%80%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%85%e0%b0%b2%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c/

డ్రై సీజన్‌ అలవెన్స్‌

మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు గ్రంథాలయ సంస్థకు బకాయిపడిన రూ.1.20కోట్లు చెల్లించి అభివృద్ధిక...
17/02/2021

మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు గ్రంథాలయ సంస్థకు బకాయిపడిన రూ.1.20కోట్లు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థచైర్మన్ గుడిపూడి.నవీన్ రావు కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయసంస్థ పాలకమండలి సమావేశం లో నవీన్ రావు మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రంధాలయ లా అభివృద్ధికి దాతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరింతగా సహకరించాలని అన్నారు. ఈ..సమావేశంలో పాలకమండలి సభ్యులు నిమ్మల.శ్రీనివాస్, పెద్ది.సైదులు,వెంకటలాల్, బిందు.శ్రీను, ఏయంఓ మందుల.శ్రీరాములు, జిల్లాగ్రంధాలయసంస్థ కార్యదర్శి రజిత, రుద్రారపు.వీరేందర్ తదితరులు పాల్గొన్నారు..

https://shivatejanews.wordpress.com/2021/02/17/%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%b9%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%97/

అభివృద్ధికి సహకరించాలి గుడిపూడి నవీన్ రావు

హైద‌రాబాద్ : త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన నాయ‌కులు, ప్రముఖుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృత‌...
17/02/2021

హైద‌రాబాద్ : త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన నాయ‌కులు, ప్రముఖుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మీ ప్రేమ‌, అభిమానాలు క‌ల‌కాలం కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ యెడియూర‌ప్ప, త్రిపుర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్‌దేవ్ కుమార్ త‌దిత‌రులు ట్విట్ట‌ర్ ద్వారా సీఎం కేసీఆర్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. సినీ ప్ర‌ముఖులు చిరంజీవి, మ‌హేశ్ బాబుతో పాటు ప‌లువురు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు....

https://shivatejanews.wordpress.com/2021/02/17/%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e2%80%8c%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b1%83%e0%b0%a4/

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

పట్టణాలలో గ్రామాలలో హైవే రహదారులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిసి కెమెరాలు ఉపయోగపడతాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ న...
06/02/2021

పట్టణాలలో గ్రామాలలో హైవే రహదారులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిసి కెమెరాలు ఉపయోగపడతాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి అన్నారు. జిల్లాలోని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో సి ఐ సాగర్, అశోక్ ఆధ్వర్యంలో మరిపెడ పట్టణ వ్యాపారస్తుల సహకారంతో 11 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ శనివారం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మీరు సమాజంలో టెక్నాలజీ ఎంత పెరిగినా నేరాలు అంతకంటే పెరుగుతున్నాయని వాటిని నివారించడంలో సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని తెలిపారు....

https://shivatejanews.wordpress.com/2021/02/06/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%98%e0%b0%be-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%ad%e0%b0%bf/

నిఘా నేత్రాలను ప్రారంభించిన ఎస్పీ

అసాంఘిక శక్తులు, ప్రజల శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే వారిపై ఫ్రెండ్లీ పోలీసింగ్ పని చేయదుఈరోజు సాయంత్రం జిల్లా పరిధి పోలీ...
05/02/2021

అసాంఘిక శక్తులు, ప్రజల శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే వారిపై ఫ్రెండ్లీ పోలీసింగ్ పని చేయదుఈరోజు సాయంత్రం జిల్లా పరిధి పోలీస్ అధికారులతో ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి గారు పాల్గొన్నారు. ఆయన జిల్లా పరిధి అధికారులతో మాట్లాడుతూ…ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పోలీసులు ప్రజలకు చేరువ కావాలని ఎస్పీ అన్నారు.ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అన్నారు.అంతేకాకుండా జిల్లా లో ఎవరైనా ధర్నాలు,దీక్షలు,నిర్వహించుకునే వారు ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తే ప్రజలకు ఆటంకం కలుగకుండా సమన్వయంతో దీక్షలు,ధర్నాలు నిర్వహించుకునేల పోలీసులు సుకుంటారని ఎస్పీ అన్నారు.ఒకరి ఇద్దరి స్వార్ధం కోసం అమాయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల స్నేహపురితమైన వాతావరణం నెలకొల్పాలని ఆయన అన్నారు

https://shivatejanews.wordpress.com/2021/02/05/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5-%e0%b0%95%e0%b0%be%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/

ప్రజలకు చేరువ కావాలి

బ్రెడ్ డెడ్ అయి ఇత‌రుల‌కు అవ‌య‌వ దానం చేసిన పేద రైతు న‌ర్సిరెడ్డి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని భువ‌న‌గిరిఎంపీ కోమ‌టిరెడ్డ...
03/02/2021

బ్రెడ్ డెడ్ అయి ఇత‌రుల‌కు అవ‌య‌వ దానం చేసిన పేద రైతు న‌ర్సిరెడ్డి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని భువ‌న‌గిరిఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు. న‌ల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన వరకాంతం న‌ర్సిరెడ్డి అనే పేద రైతు ఈనెల‌ ‌30న బ్రెయిన్ డెడ్ అయి చ‌నిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌న్నారు. అయిన సరే ఆప‌ద‌లో ఉన్న‌ ఇత‌రుల జీవితాల‌ను నిల‌బెట్ట‌డానికి వారి కుటుంబ స‌భ్యులు ముందుకు వ‌చ్చి గుండె దానం చేయ‌డం గొప్ప విష‌యమ‌ని వివ‌రించారు. వారి సేవా దృక్ప‌థం అభినంద‌నీయ‌మ‌న్నారు. తాను మ‌ర‌ణిస్తూ ఐదుగురు జీవితాల‌ను కాపాడిన న‌ర్సిరెడ్డి, వారి కుటుంబ స‌భ్యులు చ‌రిత్ర‌లో నిలుస్తార‌ని తెలిపారు....

https://shivatejanews.wordpress.com/2021/02/03/%e0%b0%a8%e2%80%8c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%81%e0%b0%82%e0%b0%ac-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0-2/

న‌ర్సిరెడ్డి కుటుంబ నిర్ణ‌యం గొప్ప‌ది

బ్రెడ్ డెడ్ అయి ఇత‌రుల‌కు అవ‌య‌వ దానం చేసిన పేద రైతు న‌ర్సిరెడ్డి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని భువ‌న‌గిరిఎంపీ కోమ‌టిరెడ్డ...
03/02/2021

బ్రెడ్ డెడ్ అయి ఇత‌రుల‌కు అవ‌య‌వ దానం చేసిన పేద రైతు న‌ర్సిరెడ్డి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని భువ‌న‌గిరిఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు. న‌ల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన వరకాంతం న‌ర్సిరెడ్డి అనే పేద రైతు ఈనెల‌ ‌30న బ్రెయిన్ డెడ్ అయి చ‌నిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌న్నారు. అయిన సరే ఆప‌ద‌లో ఉన్న‌ ఇత‌రుల జీవితాల‌ను నిల‌బెట్ట‌డానికి వారి కుటుంబ స‌భ్యులు ముందుకు వ‌చ్చి గుండె దానం చేయ‌డం గొప్ప విష‌యమ‌ని వివ‌రించారు. వారి సేవా దృక్ప‌థం అభినంద‌నీయ‌మ‌న్నారు. తాను మ‌ర‌ణిస్తూ ఐదుగురు జీవితాల‌ను కాపాడిన న‌ర్సిరెడ్డి, వారి కుటుంబ స‌భ్యులు చ‌రిత్ర‌లో నిలుస్తార‌ని తెలిపారు....

https://shivatejanews.wordpress.com/2021/02/03/%e0%b0%a8%e2%80%8c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%81%e0%b0%82%e0%b0%ac-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d/

న‌ర్సిరెడ్డి కుటుంబ నిర్ణ‌యం గొప్ప‌ది

తెలంగాణ రాష్ట్రం లో లో - గతేడాది కంటే 2.32 మీటర్ల పెరుగుదల- 23 జిల్లాల్లో ఐదుమీటర్ల లోతులో- 3 జిల్లాల్లోనే పదిమీటర్ల కంట...
03/02/2021

తెలంగాణ రాష్ట్రం లో లో - గతేడాది కంటే 2.32 మీటర్ల పెరుగుదల- 23 జిల్లాల్లో ఐదుమీటర్ల లోతులో- 3 జిల్లాల్లోనే పదిమీటర్ల కంటే దిగువన రాష్ట్రంలో భూగర్భజలాల మట్టం పెరిగింది. గతేడాది జనవరి నెలలో సగటున 8.88 మీటర్ల లోతులో భూగర్భ జలాల మట్టం ఉండగా ఈ జనవరి నాటికి 6.56 మీటర్లకు చేరింది. మెదక్‌ జిల్లాలో సగటు గరిష్ట నీటిమట్టం 11.48 మీటర్ల లోతులో ఉండగా…వనపర్తి జిల్లాలో భూ ఉపరితలం నుంచి 2.69 మీటర్ల లోతులోనే భూగర్భజలాలున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని 971 పరిశీలక బావుల ద్వారా నీటిమట్టాలను పరిశీలించగా సగటున 2.32 మీటర్ల మేరకు నీళ్లు పైకి వచ్చాయి....

https://shivatejanews.wordpress.com/2021/02/03/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad%e0%b1%82%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%9c%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%9f/

రాష్ట్రంలో భూగర్భజలాల మట్టం పెరుగుదల

వికారాబాద్‌, అనంతగిరి ఆలుగడ్డ తెలంగాణ బ్రాండ్‌తో మార్కెట్లోకి రాబోతోంది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో అనంతగిరి రైతు ఉ...
03/02/2021

వికారాబాద్‌, అనంతగిరి ఆలుగడ్డ తెలంగాణ బ్రాండ్‌తో మార్కెట్లోకి రాబోతోంది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యాన కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంఘం ఏడాదిన్నర కాలంగా కూరగాయలు, పండ్లు సేకరించి బెన్‌షాన్‌ పేరిట మార్కెటింగ్‌ చేస్తోంది. ఇప్పటి వరకు కోటి రూపాయల వ్యాపారం చేసింది. సంఘంలో మోమిన్‌పేట, నవాబుపేట, మర్పల్లి, బంట్వారం మండలాలకు చెందిన 2వేల మంది రైతులు ఉన్నారు. మార్కెట్లో ఆలుగడ్డకు ఉన్న డిమాండ్‌ను గుర్తించిన సెర్ప్‌ అధికారులు సంఘం రైతులను ఆలుగడ్డ సాగు చేసేలా ప్రోత్సహించారు.ఆగ్రా నుంచి ఆలూ విత్తనాలు తెప్పించి సబ్సిడీపై సరఫరా చేశారు....

https://shivatejanews.wordpress.com/2021/02/03/%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%95%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b/

త్వరలో మార్కెట్లకు కిలో ప్యాకెట్లు

మహనీయుల ఆశయాసాధన కోసం జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని, తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్(టిజిపిఎ)భద్రాద్రి జోన్ కార్యదర్...
02/02/2021

మహనీయుల ఆశయాసాధన కోసం జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని, తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్(టిజిపిఎ)భద్రాద్రి జోన్ కార్యదర్శి.ఐనాల పరశురాములు అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రలోని స్థానిక కనకదుర్గ పంక్షన్ హల్ లో టిజిపిఎ మండల విస్తృతస్థాయి సమావేశం మండల ఇంచార్జ్ జిన్నా పవన్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశానికి ఐనాల పరశురాములు ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతలు తొలగాలంటే విద్య ఒక్కటే పరిస్కార మార్గమని అట్టి పరిస్కారం కోసం మహనీయులు కృషి చేశారని, వారి అడుగుజాడల్లో నడుచుటకు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ అడిషనల్ డిజిపి వారి ఆలోచనలతో విద్య వ్యాప్తి ఒక ఉద్యమములా సాగుతున్న జ్ఞాన సమాజ నిర్మాణం కోసం,పేరెంట్స్ భాగస్వములు కావాలని పిలుపునిచ్చారు....

https://shivatejanews.wordpress.com/2021/02/02/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%a8%e0%b1%80%e0%b0%af%e0%b1%81%e0%b0%b2-%e0%b0%86%e0%b0%b6%e0%b0%af%e0%b0%be%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%9c%e0%b1%8d/

ఆశయాసాధన కోసం జ్ఞాన సమాజన్ని నిర్మించాలి

Address

Mani Road Maripeda

506315

Website

Alerts

Be the first to know and let us send you an email when Shiva Teja Event Organisers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shiva Teja Event Organisers:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Event Planning Service?

Share