22/03/2022
నిన్న మా ఫిల్మ్ స్కూల్ పిల్లలకు డైరెక్టర్ మణిరత్నం సర్ మాస్టర్ క్లాస్ పెట్టాను. ఆయన గురించి తెలుసుకున్నంత సేపు పిల్లలు excite అవుతూనే ఉన్నారు. పోయిన ఏడాది నాయకుడు సినిమా, అలాగే దళపతి సినిమా స్క్రీనింగ్ అయినప్పుడు ఆ క్లాసిక్స్ చూసి అంతే కనెక్టడ్ గా చాలా productive discussion చేశారు వాళ్ళు.
ఇవ్వాళ మణిరత్నం గారి మాస్టర్ క్లాస్ తర్వాత " బొంబాయి "సినిమా స్క్రీన్ చేసాను.
సినిమాకి ఎంత లైఫ్ ఉంటుంది.? అది కాలాన్ని బట్టి సామాజిక రాజకీయ భౌగోళిక ఆర్ధిక స్థితిగతులు పరిస్థితులను బట్టి ఆ సినిమా ఎస్సెన్స్ తగ్గకుండా బ్రతికి ఉండొచ్చని చెప్పొచ్చు. కాలం మారినా ఆ భావోద్వేగాలు అంతే సజీవంగా ఎంత కాలమైనా ప్రేక్షకుణ్ణి అవే భావోద్వేగాలకిలోనుచేస్తాయని చెప్పొచ్చు.
1995 లో వచ్చిన బొంబాయి సినిమా చూసి ఇప్పుడు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పూర్తిగా involve అయ్యి సినిమా చూడటమే కాదు. కన్నీళ్లు పెట్టుకుని మరీ ఆ పాత్రలను own చేసుకోవటం చూస్తే ఒక ప్రయోజనాత్మక సినిమా irespective of age ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చెప్పటానికి "బొంబాయి" సినిమా ఉదాహరణ.
No Doubt , మణిరత్నం మాస్టర్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. మా పిల్లలు సినిమా చూసి అయిపోయాక నిలబడి మరీ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు సినిమాకి చస్పట్లు కొడుతూ తమ భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోలేక పోయారంటే ఆ సినిమా ఎంత కదిలించిందో అర్ధం చేసుకోవచ్చు.
హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి గొడవలు రేపాలని చూసే రాజకీయ శక్తుల పైశాచికత్వాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించిన సినిమా "బొంబాయి" . ఇప్పటి జనరేషన్ పిల్లలలకి మణిరత్నం లాంటి ఫిల్మ్ మేకర్ అవసరం ఎంతుందో అనిపించింది. సామాజిక అంశాలను ఎత్తుకోవటమే కాదు వాటిని కథలా ఎలా మలిచారు అన్నది చూస్తే ఫిల్మ్ మేకర్స్ కూడా చాలా నేర్చుకోవచ్చు.
ఈ తరం పిల్లలకి ఉపాధ్యాయులు కచ్చితంగా చూపించాల్సిన సినిమా "బొంబాయి". ఆ సినిమాలో వేసే ప్రశ్నలకి సమాధానాలు అప్పుడూ దొరకలేదు ఇప్పుడూ దొరుకుతాయో లేదో తెలీదు.
సినిమా ఒక POWERFUL MEDIUM. ఎంతో మందిని కదిలించగలదు. COMMUNICATE చేయగలదు. నిజాలను ఆలోచించేలా చేయగలదు. తమిళ్ హిందీ తెలుగుల్లో విడుదలైన ఈ సినిమా మూడు భాషల్లో విజయం సాధించింది. అప్పుడు హృదయ పూర్తిగా ఈ సినిమాని హత్తుకున్న వాళ్ళు ఏ కల్మషం లేని వాళ్ళు. మరి యిప్పుడు జరుగుతున్న మత మౌఢ్యం తాలూకు ఘర్షణలను తిప్పికొట్టే మనుషుల లెక్క పెరుగుతున్నట్టా తగ్గుతున్నట్టా అన్నది ఆలోచిస్తే అర్ధం అయ్యే అంశమే. మతాలని దాటి మానవత్వమే తమ అభిమతంగా ఎదిగాల్సిన పిల్లలకి ఈ సినిమా చూపించటం ఇప్పటి అవసరం కూడా.
ప్రత్యామ్నాయం లేని చోట కనపడని చోట మనమే ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. ఇలాంటి సినిమాని మళ్లీ ఈ తరం వాట్సాఫ్ యూనివర్సిటీ విద్యార్థులైపోయిన వాళ్ళకి కూడా తెలివి వచ్చేలా ప్రదర్శన చేయించాలి.
****
Rj Ganesh