24/03/2020
అతి ముఖ్య సమాచారం🙏🏻
ప్రతి ఒక్కరూ ఒకటికి
పదిసార్లు చదవండి..
ఇంట్లో పెద్దవారికీ..
స్మార్ట్ ఫోన్ లేనివారికీ..
మీతో ఉండే చదువలేని
వారికీ వివరంగా చెప్పండి...
ఎందుకంటే, కరోనా వారికి వస్తే,
మీకూ వచ్చినట్టే..
మిమ్మల్ని మీరు కాపాడుకోండి..
మీ తోటి వారిని జాగృతం చేయండి..
👉చైనా వాళ్ళు జనవరి 23 నుంచి ఇంట్లో కూర్చుని lockdown లో ఉంటే నిన్న మొదటి సారి..60 రోజుల తరువాత, కొత్త cases రాకుండా ఆగాయి. దీనిని బట్టి మనం ఎన్ని రోజులు - ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి బాగా ఆలోచించండి🙏🏻
👉మాకు ఏమి కాదులే అని అనుకుంటే పొరపాటే.
ఒకసారి india లో పాకింది అంటే, కనీసం 1 కోటి మంది చనిపోతారు.
👉వెల్లుల్లి, అల్లం, హోమియో, పసుపు ఇవన్నీ వైరస్ ని చంపేసేవి అయితే, ప్రపంచం అంతా ఎప్పుడో అది వాడి దీన్ని కంట్రోల్ చేసేది. దయచేసి You Tube వెధవల మాటలు నమ్మకండి.
👉దయచేసి ఇంట్లో ఉండండి. చదువుకోని వాళ్ళకి దీని importance చెప్పండి..
కొంత డబ్బు చేతిలో ఉంచుకోండి.
ATMలు..బాంకుల పరిస్థితి
ఏమిటో చెప్పలేము.
డబ్బు చాలా చాలా జాగ్రత్తగా
వాడండి. తిండికి, మందులకీ తప్పితే అనవసరంగా దేనికి రూపాయి వృథా చేయవద్దు. సింపుల్ గా జీవించండి.
👉ఇటలీ లో 1000 మందికి
2.5 బెడ్స్ ఉంటేనే అంత మంది చచ్చిపోయారు. India లో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయ్ హాస్పిటల్స్లో. మన హాస్పిటల్స్ లో
వసతులు అంతంత్ర మాత్రం..
👉మేము బాగున్నాం, మాకు ఎం కాదు, అని అనుకుంటే పొరపాటే. ఇది గాలిలో నుంచి కూడా వస్తుంది అని ఇవాళే WHO చెప్పింది.
👉ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గుతుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే.
దయచేసి డాక్టర్స్ కి , నర్సులకి
పని పెంచవద్దు.
👉ఎక్కడికి వెళ్లద్దు.
మీకు ఎవరిమీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళకి దూరంగా ఉండండి.
ముఖ్యంగా, బయట అంతా తిరిగి
ఇంట్లో ముసలివారిని బలి చేయకండి.
👉🏻ఇంటికి రాగానే బట్టలు డెట్టాల్ లో
నానబెట్టండి. ఫ్రెష్ గా స్నానం చేసి
తరువాత ఇంట్లో మిగతావారిని
కలవండి..బయటనుండి ఇంట్లోకి వచ్చిన పది నిమిషాల్లో మీ స్నానం అయిపోవాలి.
👉🏻దయచేసి ఎవరిదో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందనో పోయి కలవవద్దు.
కావాలంటే, ఫోను contact list చూసి, ప్రతి ఒక్కరితో మాట్లాడు.
నీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క నంబరుకీ
ఈ సమాచారం పంపించు 🙏🏻
కరోనా గురించి మాట్లాడు.
నీకు తెలిసిన సమాచారం వారికి
తెలియజేయండి.
👉india వాళ్ళకి ఇమ్యూనిటీ
ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ,
వైరస్ చస్తుంది..ఇవన్నీ నిజాలు కావు.
అది ఏ temperature లో అయిన వ్యాపిస్తుంది.
👉1918 లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశంలో 1 కోటి మంది చచ్చిపోయారు. అప్పుడు,
రవాణా సదుపాయాలు,
ప్రజల కదలిక ఇంత లేదు.
అయినా కూడా అంతా వ్యాపించింది.
👉దయచేసి, మాకు india లో
300 కేసులు మాత్రమే ఉన్నారు..
తక్కువ తీవ్రత అని అనుకోకండి.
1 వారంలోనే ఇటలీ, ఇరాన్ లలో
300 నుంచి 6000-7000 వరకు,
2 వారాలు లో 20,000 కు పెరిగిపోయాయి. ఇప్పుడు
రోజుకు వందల మంది చనిపోతున్నారు.
🙌చేతులు శుభ్రంగా సబ్బు తో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు
పాటు కడగాలి.
🥱🤭🤧 ఊరికే మొహం,
ముక్కు, నోరు, కళ్ళు, తాకవద్దు.
వీలయినంత ఇంట్లోనే ఉండండి..
దగ్గు, జలుబు ఉంటే అస్సలు
ఎవరినీ తాకవద్దు.
ఏ ఇబ్బంది ఉన్నా,వెంటనే
గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి
పరీక్ష చేయించుకోండి.
👉🏻 మాస్క్ వేసుకొని..
చేతులు కడుక్కుంటే..కరోనా రాదు
అనే భ్రమలో ఉండకండి..
ఫుల్ బాడీ సూటులు వేసుకుని,
అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న డాక్టర్లకు
కూడా ఇది వ్యాపించింది..
మనుషులందరూ ఒకరికొకరు,
వీలయినంత దూరంగా
ఉండటం చాలా ముఖ్యం..
👉🏻 ఇంట్లో..పని ప్రదేశంలో
అందరూ ఒకరికొకరు..
వీలయినంత దూరంగా ఉండండి.
మీకు వైరస్ సోకిందన్న విషయం,
మొదటి పది రోజులు మీకు కూడా
తెలియదు(incubation period)..కానీ, ప్రక్కవారికి
వ్యాప్తి చేస్తారు..
👉🏻ఎదుటి వారి ఫేస్ టు ఫేస్..
మొహం వంక చూస్తూ మాట్లాడకండి.
వీలయినంత దూరంగా ఉండి, తలవంచుకొని మాట్లాడండి..
కంటికి కనపడకుండా, ఒకరి నోటి తుంపర్లు వేరొకరి మొహం మీదా..
బట్టలమీద పడతాయి..
తద్వారా, మీకూ వైరస్
సంక్రమిస్తుంది🙏🏻
🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
దయచేసి ఈ జాగ్రత్తలన్నీ
తూ.చ. తప్పకుండా పాటించి,
కరోనా మహమ్మారికి మన
భారతీయులు బలవ్వకుండా
ప్రతి ఒక్కరూ తమ వంతు
కృషి చేయండి..జై హింద్ !
🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
ఈ సమాచారం మీ ఫోనులో ఉన్న
ప్రతి నంబరుకు షేర్ చేయండి !
మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ
అర్థమయ్యేలా చెప్పండీ 🙏🏻