09/07/2017
LEADER.....
చిక్కటి చిరునవ్వు... తెల్లని ఆ పంచకట్టు అచ్చుగుద్దినట్లు పదహారణాల ఆంధ్రుడి వస్త్రాధారణ మహానేత వైయస్ఆర్ ది!
2007లో అమెరికాలో జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సులో కూడా పంచ కట్టుకునే వెళ్ళారు వైయస్ఆర్.. "ఏంటి సార్ ఇక్కడ కూడా! 150 దేశాల ప్రతినిధులు వచ్చారు. అందరూ సూట్ లో ఉన్నారు. మీరు ఇలా ఉంటే ఏమనుకుంటారు అని అధికారులు అడిగిన ప్రశ్నకు వైయస్ఆర్ ఇలా స్పందించారు...
" నథింగ్ డూయింగ్.. నా డ్రస్ నాదే. నేను వచ్చింది రైతుల సదస్సుకు. నేను ఒక ముఖ్యమంత్రినే కాదు రైతును కూడా. ఏం అమెరికాలో లేడా రైతు! ఆస్ట్రేలియాలో లేడా రైతు.. ఇందులో వారు చిన్నచూపు చూడటానికి ఏముంది? ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. ఎవరి సంప్రదాయం వారికి ఉంటుంది."