Dr Pasham V K Reddy Matrimony

Dr Pasham V K Reddy Matrimony We are experts in dealing high end
profiles of all over the globe... hi
(16)

..
17/04/2024

..

.
08/03/2024

.

.
18/01/2024

.

`Raksha Bandhan is a Hindu festival that celebrates the bond between brothers and sisters. It is also known as Rakhi Pur...
31/08/2023

`
Raksha Bandhan is a Hindu festival that celebrates the bond between brothers and sisters. It is also known as Rakhi Purnima, or simply Rakhi, in many parts of India. The festival is observed on the full moon day of the Hindu month of Shravana, which typically falls in August . On this day, sisters tie a sacred thread, called a rakhi, around the wrists of their brothers, symbolizing their love and protection. The brothers, in turn, vow to protect and care for their sisters and give them gifts. The tradition of Raksha Bandhan is said to have originated from ancient times, when gods, goddesses, kings and queens exchanged rakhis as a sign of alliance or friendship.

The term "Raksha Bandhan" means a "knot of protection". Rakhi has gained a symbolic meaning in Hindu culture. It emphasizes the significance of the bond between siblings. Additionally, the festival serves as an occasion for married women to return to their parent's home for the ceremony. In modern times, brothers also tie Rakhi to their sister's hands. Sisters also celebrate the day by tying Rakhi on each other's wrists.

One of the legends associated with this festival originates from the epic Mahabharata. According to the mythology, Lord Krishna accidentally cut his finger on the Sudarshan Chakra. Seeing this, Draupadi tore a piece of cloth from her saree and tied it to the injury to stop the bleeding. Lord Krishna, deeply touched by her gesture, promised to protect her forever. He fulfilled this promise when Draupadi faced public humiliation in the royal court of Hastinapur when the Kauravas tried to shame her.

`
రక్షా బంధన్ అనేది సోదర సోదరీమణుల మధ్య బంధాన్ని జరుపుకునే హిందూ పండుగ. దీనిని భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రాఖీ పూర్ణిమ లేదా సింపుల్ గా రాఖీ అని కూడా పిలుస్తారు. ఈ పండుగను హిందూ మాసం శ్రావణ మాసం యొక్క పౌర్ణమి రోజున జరుపుకుంటారు, ఇది సాధారణంగా ఆగస్టులో వస్తుంది. ఈ రోజున, సోదరీమణులు తమ సోదరుల మణికట్టు చుట్టూ రాఖీ అని పిలువబడే పవిత్ర దారాన్ని కడతారు, ఇది వారి ప్రేమ మరియు రక్షణకు చిహ్నం. సోదరీమణులను సంరక్షిస్తామని, సంరక్షిస్తామని, బహుమతులు ఇస్తామని అన్నదమ్ములు ప్రతిజ్ఞ చేస్తారు.

తన్లాట వడుతున్నదో పానంపెల్లాడ గోరుతుందో కళ్ళల్ల తిరుగుతుండో వాడుపెదవుల్ల మెదులుతుండో......
24/08/2023

తన్లాట వడుతున్నదో పానం
పెల్లాడ గోరుతుందో
కళ్ళల్ల తిరుగుతుండో వాడు
పెదవుల్ల మెదులుతుండో......

Koshati Meesalodu Song - Ole Ole Song By Indravati Chauhan ...

08/08/2023

*కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు.*

*దౌర్భాగ్యకరమైన పరిస్థితి*

*ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతుంది దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు.*

*కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు:*

*1.అతి తెలివి*

*2.చిన్న తప్పును కూడా భరించే శక్తి , సహనం లేవు.*

*3.అందరూ సమానమే అనే వింత భావన పెరగటం ( డెమాక్రసి).*

*4.పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక పోవడం.*

*5.ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లోని వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.*

*6.చిన్నదానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.*

*7.ఎవరో ఒకరి నోటి దురుసు తనం కుటుంబం మొత్తం చిన్నా భిన్నం కావడానికి కారణం అవుతుంది.*

*8.ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం.*

*9.ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు.*

*అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది.*

*అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత 30, 40 ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు.*

*10.ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండా పోతుంది.*

*11.మనుష్యులు అంటేనే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ లాలస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.*

*12.మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.*

*13.కుటుంబ నిర్వహణ ఒక కళ. ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.*

*14.మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను నాభార్య/భర్త అనే సిద్దాంతం పోయి "నేనే నేను" "నేను నేనే"పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచుకోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు.*

*కుటుంబ విలువలు,కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి. అన్నా దమ్ములు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ, భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే లేవు. సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో. ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు.*

15 *డిజిటల్ ప్లాట్ఫాం పైన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తమకి నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం*

*ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉండదు*

‼️ ఇది ఇంతే. అది అంతే. ఎవ్వరూ ఏమీ చేయ లేరు. ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము.*‼️

19/06/2023

....

05/01/2023
15/09/2022

*_ఈ రోజు నుండి శుక్ర మౌఢ్యమి ప్రారంభం_*

🌓🌓🌓🌓🌓🌓🌓🌓🌓

*సెప్టెంబర్ 15 గురువారం నుండి డిసెంబర్ 2 శుక్రవారం వరకు శుక్ర మౌఢ్యమి*

జ్యోతిష్య శాస్త్రం రెండు రకాల మౌఢ్యమిల గురించి చెబుతోంది. ఒకటి శుక్ర మౌఢ్యమి , మరొకటి గురు మౌఢ్యమి. సెప్టెంబర్ మాసం 15 వ తేదీనుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు అనగా 79 రోజులపాటు శుక్ర మౌఢ్యమి ఉంటుంది. మౌఢ్యమినే వాడుక భాషలో మూడం అంటారు.

నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. భూమి , సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆగ్రహం తన శక్తిని కోల్పోతుంది , అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం , శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే దానికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అన్ని గ్రహాలకు ఈ పరిస్థితి వస్తున్నప్పటికీ ప్రధానంగా శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది జ్యోతిష్య శాస్త్రం.

గురు , శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం జరుగుతుందని. కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం. ఆటు , పోటులలో మార్పులు వస్తాయి. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు , ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యధికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి , శృంగార జీవితానికి కారకుడు జాతకంలో శుక్రుడు బల హీనంగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయాలి.

*మూఢంలో చేయతగినవి*

అన్నప్రాసన చేసుకోవచ్చు.

ప్రయాణాలు చేయవచ్చు.

ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చు.

భూములు కొనుగోలు , అమ్మకాలు , అగ్రిమెంట్లు చేసుకోవచ్చు.

నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు.

నూతన వాహనాలు , వస్త్రాలు కొనవచ్చు.

జాతకర్మ , జాతకం రాయించుకోవడంబీ, నవగ్రహ శాంతులు , జప , హోమాది శాంతులు , గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు చేయవచ్చు.

సీమంతం , నామకరణం , అన్నప్రాసనాది కార్యక్రమాలు చేయవచ్చు. గర్భిని స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిథులలో అశ్విని , దేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

*మూఢంలో చేయకూడనివి*

*వివాహాది శుభ కార్యాలు జరుపకూడదు.*

*లగ్నపత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరారు.*

పుట్టు వెంట్రుకలు తీయించరాదు.

గృహ శంకుస్థాపనలు చేయ రాదు.

ఇల్లు మారకూడదు.

ఉపనయనం చేయకూడదు.

యజ్ఞాలు , మంత్రానుష్టానం , విగ్రహా ప్రతిష్టలు , ప్రతాలు చేయకూడదు.

నూతన వధువు ప్రవేశం , నూతన వాహనం కొనుట పనికిరాదు.

బావులు , బోరింగులు , చెరువులు తవ్వించకూడదు

వేదావిధ్యా ఆరంభం , చెవులు కుట్టించుట. నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదు.

08/09/2022


  Pasham V K Reddy Matrimony  Gouthami Reddy
08/09/2022

Pasham V K Reddy Matrimony
Gouthami Reddy

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు💐Dr Pasham V K Reddy Matrimony Greenhills Colony,  Kothapeta 083092 08...
31/08/2022

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు💐

Dr Pasham V K Reddy Matrimony
Greenhills Colony, Kothapeta
083092 08218

https://maps.app.goo.gl/9E8SuU4hzwmuyfZx6

Address

Dr Pasham V K Reddy Matrimony, Shop No 13, Gayatri Towers Road No 2 , Green Hills Colony Beside Victoria Memorial Metro Station, Kothapet, L. B. Nagar, Telangana, , , Https://goo. Gl/maps/Fodf9fLLeez5
Hyderabad
500035

Opening Hours

Monday 11am - 3pm
Wednesday 11am - 3pm
Thursday 11am - 3pm
Friday 11am - 3pm
Sunday 11am - 2pm

Telephone

+918309208218

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Pasham V K Reddy Matrimony posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr Pasham V K Reddy Matrimony:

Videos

Share

Dr Pasham V k Reddy Matrimony

Who are Looking Seriously For Marriage Alliances.

Take Here First Step Calls on +91-8309208218

Dr Pasham V k Reddy Matrimony

Nearby event planning services

  • RSEvents

    RSEvents

    18-R, Green Hills Colony, Kothapet

Other Wedding planning in Hyderabad

Show All