27/10/2022
*గోల్డ్ లోన్లను సద్వినియోగం చేసుకోవాలి*
*హెచ్డిఎఫ్సి కొత్తూరు శాఖలో గోల్డ్ లోన్ సెక్షన్ ను ప్రారంభించిన*
*మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్*
కొత్తూరు అక్టోబర్ 27
*కొత్తూరు పరిసర ప్రాంత ప్రజలు గోల్డ్ లోన్లను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు. కొత్తూరు హెచ్డిఎఫ్సి బ్రాంచ్ మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ శాఖలో గోల్డ్ లోన్ సెక్షన్ ను మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇతర బ్యాంకుల్లో గోల్డ్ లోన్ కు వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయని కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకులో తక్కువ మొత్తంలో వడ్డీ తీసుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్డిఎఫ్సి కొత్తూరు బ్రాంచ్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 650 శాఖలో గోల్డ్ లోన్లు ఇస్తుందని చెప్పారు. ప్రజలందరూ హెచ్డిఎఫ్సిలోన్ గోల్డ్ లోన్ తీసుకొని వారి అవసరాలకు వినియోగించుకోవాలని కోరారు.అలాగే తిరిగి కట్టేటప్పుడు తక్కువ మొత్తంలో వడ్డీ తీసుకుంటామని వివరించారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*