29/04/2023
అమ్మా, ఈ రోజు 30, ఏప్రిల్, నీ పుట్టిన రోజు...మన 'బుచ్చిరాజు కళ్యాణ వేదిక' లో ఘనంగా నీ పుట్టినరోజు జరపాలని...మాతృ పూజ చేయాలనీ...అనుకున్నానమ్మా.......నీకు చెప్పాను కూడా... మంగళగిరి పట్టుచీర కొనమన్నావు కదా....కట్టుకోకుండానే... హడావుడిగా ..ఎందుకు వెళ్లిపోయావు...ఈ ఫోటో..రెండేళ్ల కిందట నీ పుట్టినరోజు నాడు నేనే తీసాను...అదే నీ సంస్మరణ ఫోటో అవుతుందని ఊహించలేదమ్మా....నీ అదృశ్యం తట్టుకోలేక పోతున్నాము.....82 ఏళ్లు...అనాయస మరణం..అదృష్టం అంటున్నారు అందరూ...నీకు ఇప్పట్లో మరణం ఏమిటో...అస్సలు అర్ధం కావటం లేదు....నీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము...నీకు తెలుసు కదా....కుటుంబానికి మూలస్తంభానివి కదా...అలా వెళ్లిపోతే...కుటుంబం కూలిపోదూ...కూలిపోకుండా జాగ్రత్తగా కాపాడుకో ...సరేనా....సోజా రాజకుమారీ..సోజా....