13/01/2024
పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పుణ్యదినాన్ని తెలుగు వారు సంక్రాంతిగా జరుపుకుంటారు. ‘సం’ అంటే మిక్కిలి ‘క్రాంతి’ అంటే అభ్యుదయం అని అర్థం. మంచి అభ్యుదయాన్నే ఇచ్చే క్రాంతి కాబట్టి దీన్ని ‘సంక్రాంతి’గా పేర్కొన్నారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.. భోగి మంటలు, వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలూ.. పిట్టలదొరల బడాయి మాటలు.. తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే పండగ సంక్రాంతి..
🌿🌹🙏'భోగి' భోగభాగ్యాలతో🙏🌹🌿
🌿🌹🙏సంక్రాంతి' సంపదలతో🙏🌹🌿
🌿🌹🙏'కనుమ కనువిందుగా🙏🌹🌿
🌿🌹జరుపుకోవాలని కోరుకుంటూ.🌹🌿
🌿🌹మీకు,కుటుంబ సభ్యులందరికీ🌹🌿
సంక్రాంతి శుభాకాంక్షలు..
*ఆధ్యాత్మికంగా మరియు మతపరంగా సంక్రాంతి పండగ యొక్క ముఖ్యత్వం.*
సంక్రాంతి పర్వదినాన ప్రజలు సూర్యభగవానునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సంక్రాంతి సూర్యునికోసం ఏర్పడిన పండుగ. ఈరోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణానికి మారుతాడు. ధనురాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. మన భారతదేశంలో జనవరి మాసంలో మనం జరుపుకునేది ‘‘మకరసంక్రాంతి’’. సంక్రాంతి పండగను రెండు లేక నాలుగు రోజులు జురుపుకుంటారు. సంక్రాంతి పండుగలోని ప్రతిరోజుకు ఒక్కొక్క ప్రాంతంలో ప్రత్యేకమైన పేరు మరియు ప్రత్యేక విధానంతో జరుపుకుంటారు.
1వ రోజు - లోహ్రి, మాఘీ, భోగిపండుగ.
2వ రోజు - మకరసంక్రాంతి, పొంగల్, పెద్దపండుగ, ఉత్తరాయణ, మాఘ్ బిహు.
3వ రోజు - కనుమ పండుగ, మాట్టు పొంగల్.
4వ రోజు - కానుమ్ పొంగల్, ముక్కనుమ.
*పండుగ విధానము *
సంక్రాంతి పండుగ అనేక రకాలుగా జరుపుకుంటారు. పండుగ జరుపుకునే తీరుతెన్నెలు ప్రతి ప్రాంతానికి వేరు వేరుగా ఉంటాయి. మొత్తానికి ఇది ప్రకృతికి ధన్యవాదాలు చెప్పే పండుగ అని అనుకోవచ్చును. నెల రోజుల ముందు నుండే ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు.గొబ్బెమ్మలు స్వాగతం పలుకుతాయి. నెలంతా హరిదాసులు కీర్తనలు పాడుతూ ఇల్లిల్లు తిరుగుతారు. గంగిరెద్దులు, కోడిపందాలు, ఎడ్లపందాలతో గ్రామాలు హడావుడి చేస్తాయి. మకరసంక్రాంతి ముందురోజు ప్రజలు తమ ఇళ్లముందు భోగిమంటలు వేస్తారు. ఈ భోగిమంటల్లో పాత వస్తువులను వేసి కొత్తకు స్వాగతం చెప్తారు. ఉదయించే సూర్యనికి జరిగే ఉత్సవం సంక్రాంతి. ప్రతి ఇల్లు తోరణాలతో, బంతి పూలతో కళకళలాడుతుంది. రైతులు చక్కని పంట చేజిక్కిందని సంతోషంగా పండుగ జరుపుకుంటే. సామాన్య ప్రజానీకం కొత్త పంటదినుసులు వచ్చాయని సంతోషిస్తారు. కారణమేదైనా ప్రతి ఒక్కరు కొత్త బియ్యంతో తీపివంటకాన్ని తయారుచేసి సూర్యనికి సమర్పిస్తారు. ఈ సంక్రాంతి రోజుల్లో దేవుళ్లనే కాదు ఆవులను, గేదెలను, ఎద్దులను కూడా పూజిస్తారు. చెడు దృష్టినుండి తమ పిల్లలను రక్షించడానికి రేగుపండ్లు, చెరుకు ముక్కలను వారి తలలపై వేసి దిష్టి తీస్తారు. మా పిల్లలకు భోగిపండ్లు పోస్తున్నామని ముత్తైదువలను పిలిచి పేరంటం చేస్తారు. వచ్చిన వారికి నువ్వులు బెల్లం పండిపెడతారు. కొంతమంది బొమ్మల కొలువు కూడా పెడతారు.
మకర సంక్రాంతి రోజు వేకువనే లేచి తలస్నానం చేసి ఆడపడుచులు వాకిళ్లలో ముగ్గులు వేస్తుంటే సంక్రాంతి శోభ అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంట్లో తీపి వంటలు, గారెలు చేసి చుట్టాలతో కలిసి ఆనందంగా భోజనం చేస్తారు. కొత్త అల్లుళ్లు అత్తవారిళ్లకు వస్తారు. అత్తామామలు వారికి మర్యాదలు చేస్తారు. ఈరోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. మూడవ రోజును కనుము పండుగ అని పిలుస్తారు. ఈ రోజు తమకు వ్యవసాయంలో సహాయపడిన పశువులకు పూజచస్తారు. ఆవులకు, ఎడ్లకు చక్కగా స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమలు దిద్ది పూజిస్తారు. వాటికి చక్కని ఆహారం పెండతారు. దీని తరువాత వచ్చే పండుగ ముక్కనుమ.
మకరసంక్రాంతిని వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లతో జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ అంటే, అస్సాం రాష్ట్రంలో మాఘ్ బిహుం, భోగల్ బిహుం అంటారు. పంజాబు, హర్యానా రాష్ట్రాలలో లోహ్రి పండుగ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో ఖిచిడీ పండుగ అంటే బీహారులో తిల్ సంక్రాంతి లేక ఖిచిడీ పండుగ అంటారు.
మరి సంక్రాంతి పండుగకు కృష్ణుడికీ ఏమిటి సంబంధం? పురాణ కథల ప్రకారం యశోదాదేవి ఎన్నో ఉపవాసాలు, వ్రతాలు చేయగా శ్రీకృష్ణుని కొడుకుగా పొందింది. సంక్రాంతి పంటల పండుగ, రైతు పండుగ, శ్రీకృష్ణుడు ఒక ప్రక్క రైతులకు, ఇంకొకవైపు సూర్యునికి దగ్గరవాడు. అదే సూర్యుడు, రైతు జీవితానికి పంటశోభకు కారణభూతుడు.
దక్షిణాది ప్రాంతాలలో ప్రముఖంగా వినిపించే కథలలో కృష్ణుడు గోవర్ధనగిని ఎత్తి ప్రజలను రక్షించింది మకర సంక్రాంతి మరుసటిరోజు, కృష్ణుడు తన చిటికెన వేలి గోరుపై ఏడు పగళ్ళు, ఏడు రాత్రులు గోవర్థన పర్వతాన్ని నెలబెట్టి గోవులను, ప్రజలను కాపాడాడు. ఆ సమయంలో, పర్వతం క్రింద బృందావన వాసులకు కటిక చీకటి ఉండటం కృష్ణునికి తెలుసు. వారి సౌలభ్యం కోసం కృష్ణుని రెండు కళ్ళు సూర్య చంద్రుల వలె మారి మారి ప్రకాశించాయి.
కృష్ణునికి సూర్యనారయణడనే పేరు కూడా కలదు. కృష్ణునికి సూర్యునికి గల ఆప్తసంబంధం అందరికీ తెలియదు. తన మొదటి భగవద్గీతను 12 కోట్ల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు మొట్టమొదట సూర్యునికి వినిపించాడు.
సంక్రాంతి మూడవ రోజు శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతి పాత్రమైన పశువులను పూజిస్తారు. భగవద్గీతలోని 10వ అధ్యాయం, 21వ శ్లోకం చూస్తే శ్రీకృష్ణుని బాంధవ్యం వివిధ కోణాల్లో ఆవిష్కృతమవుతుంది.
శ్లోకం :
*ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |*
*మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహాం శశి ||*
కృష్ణుడు ఇలా పలికాడు 12 మంది ఆదిత్యులలో నేను విష్ణువును, వెలుగులన్నింటిలో నేను అతి ప్రకాశవంతమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రాలలో నేను చంద్రుడిని.
శాస్త్రప్రకారం, ఈ రోజు చేసే ధానాలు వందింతలు ఫలితాన్ని ఇస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఆ రోజు కంబళ్ళను, వెచ్చని వస్ర్తాలను, వెన్న, బియ్యం, పప్పు ధాన్యాలు, పవిత్రమైన పుస్తకాలను దానం చేయ్యండి.
మీ ఎడిట్ పాయింట్ రమేష్ & ఫ్యామిలీ