23/12/2023
🏹🏹🏹🏹🏹🏹🏹 జగమంతా రామమయం.
🏹🏹యుద్ధకాండం🏹🏹
3️⃣8️⃣4️⃣
జాంబవంతుడు హనుమంతుడిని దగ్గరకు పిలిచి ఇలా అంటున్నాడు.
నాయనా హనుమంతా ఇప్పుడు వానరులంతా కష్టాల్లో వున్నారు.
రామలక్ష్మణులు మూర్చనుండి దీర్ఘ నిద్రలోనికి వెళ్ళకుండానే నీవు ఉత్తర దిక్కుకు పయినించి హిమాలయపర్వతాలలో
వున్న సంజీవిని తెచ్చి వానర సేనను బ్రతికించి మరలా యుద్ధానికి సన్నద్ధం చేయవలసిన సామర్థ్యం నీకే వుంది వెంటనే ఉపక్రమించాలి అని ఇంకా ఇలా అంటున్నాడు.
ఆ దివ్య పర్వతం పై నాలుగు ముఖ్యమైన ఔషదులు ఉన్నాయి.
అవి ప్రకాశిస్తూ కనిపిస్తాయి
అందులో
*సంజీవి కరణి* దానివలన చనిపోయిన వాళ్లు లేచి కూర్చుంటారు.
*విశల్యకరణి*
దీనిని తాకిస్తే ఎంతటి గాయాలైనా వ్రణాలైన మాయమయి పోతాయి
*సౌవర్ణకరణి*
దీనివలన గాయాలు మచ్చలు కూడా పోతాయి
*సందానకరణి*
తెగిపోయిన అవయవాలను అతికిస్తుంది.
ఇటువంటి విషిశ్ఠగుణాలు కలిగిన ఈ నాలుగు మూలికలను తెచ్చి రామలక్ష్మణులను వానరులు కాపాడు నాయనా అని అనంతనే హానుమంతుడు ఇంక ఆలస్యం చేయకుండా తన శరీరాన్ని పెంచి త్రికూట పర్వతం పైకి ఎగిరాడు.
స్వామి కాలు మోపగానే పర్వతం కంపించింది,శిఖరాలు పెలపెలమని విరిగిపోయాయి.
లంకా పట్టణం దద్దరిల్లిపోయింది హనుమ ఆ పర్వతం కాలుతో నొక్కి మలయపర్వతం మీదకు ఎగిరి పోయాడు.
మలయపర్వతం 60 యోజనాల ఎత్తులో జలాశయాలతో
కమలములతో వన్యమృగాలతో గుహలతోనూ వుంది.
అచ్చటకు దేవతలు,గంధర్వులు
విహారానికి వస్తూ వుంటారు.
ఆ పర్వతం మీదనుండి గట్టిగా గర్జిస్తూ తోకను పైకి ఎత్తి
సముద్రునికి నమస్కరించి నోరు పెద్దగా చేసి నడుముసారించి గాలిలో లేచి గరుడవేగంతో రామకార్యానికి ఉద్యుక్తుడయ్యాడు.
హనుమ గాలిలోకి లేచిన వేగానికి
చెట్లుకూలిపోయావి,శిఖరాలు విరిగిపోయావి.
జలచరాలు మీదకు లేచేయి
రాక్షసులు భయంతో నిశ్చేష్టులయి పోయారు.
హనుమంతుడు ఆకాశంపై వాయువేగంతో నదులు,సముద్రాలు దాటుతూ హిమాలయాలపై ప్రయాణం సాగిస్తున్నాడు.